ఎన్టీఆర్ ఇప్పటి వరకు.. బాలకృష్ణ-కళ్యాణ్ రామ్ లతో నటించకపోవడానికి కారణం అదేనా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలను ఎక్కువగా ట్రెండింగ్ అలాగే ట్రోలింగ్ గురి చేస్తున్నారు ఆకతాయిలు . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉండడం గమనార్హం. రీసెంట్గా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.

జూనియర్ ఎన్టీఆర్ చరణ్తో కలిసి బిగ్ మల్టీస్టారర్ మూవీలో నటించారు . ఈ సినిమా ఏకంగా ఆస్కార్ ని కూడా ఇండియాకు తీసుకొచ్చింది. అయితే అలాంటి ఎన్టీఆర్ ఇన్నేళ్ల తన కెరియర్లో ఎందుకు నందమూరి హీరోలు అయినా బాలకృష్ణ అలాగే కళ్యాణ్ రామ్ తో నటించ లేదు అన్న ప్రశ్న ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది . అయితే ఈ విషయాన్ని కావాలనే కొందరు చిచ్చు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు .

నిజానికి ఏ డైరెక్టర్ కూడా ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ అలాగే నందమూరి బాలకృష్ణ లతో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకునే విధంగా కథలు రాయలేదట . ఒకటో రెండో అలాంటి కథలు వచ్చిన అవి చెత్త సినిమాలుగా నిలిచిపోతాయి అని తెలిసి రిజెక్ట్ చేశాడట . అంతే తప్పిస్తే ఎక్కడ ఓల్డ్ వార్ 1 ఓల్డ్ వార్ 2 రేంజ్ లో గొడవలు జరగలేదు అని ఇదంతా కేవలం పుకార్లేనని నందమూరి ఫ్యాన్స్ కొట్టి పడేస్తున్నారు..!!