‘ విశ్వంభర ‘ సెట్స్ లో అందరి ముందే డైరెక్టర్ పై అరిచేసిన చిరంజీవి.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోస్ కూడా ఆయనను అభిమానిస్తూ ఉంటారు. ఇప్పటికే ఎన్నో సినిమాలతో హిట్లు కొట్టి.. ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న చిరంజీవి.. ప్రస్తుతం మ‌ల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభ‌ర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. ఇక ఎప్పటికప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా వాటిని బాగా వైరల్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా విశ్వంభరకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెటింట‌ వైరల్ గా మారింది.

షూటింగ్ సెట్స్ లో చిరంజీవి డైరెక్టర్ వశిష్టపై అందరి ముందే అరిచేసాడని ఫుల్ ఫైర్ అయిపోయాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే చిరంజీవి కోపానికి కారణం ఏంటి.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. వశిష్ట ముందు చిరంజీవి గారికి నెక్స్ట్ జరగబోయే సీన్ ఇదేనంటూ వివరించి మరొక సీన్ షూట్‌కు ప్లాన్‌ చేశారట. దీంతో చిరంజీవి విపరీతమైన కోపంతో అతనిని అరిచాడట. ఒక సీన్ షూట్ అని చెప్పి.. తీరా టైంకి వేరే సీన్ చేయాలనుకుంటున్నావా.. అని ప్రశ్నించారట. ఇక రేపు చేయబోయే సీన్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ముందే ఇవ్వాలని దర్శకుడు కి వివరించారట. దానికి కారణం ముందు రోజే సీన్లు చెప్తే అక్కడ నటించే యాక్టర్స్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓ క్లారిటీ ఉంటుందని ఉద్దేశంతోనే చిరంజీవి అలా కోప్పడినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం వశిష్టకు ఇది ఓ పెద్ద బాధ్యత అని చెప్పాలి. చిరంజీవి లాంటి స్టార్ హీరోని హ్యండిల్‌ చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. అలాంటిది ఆయనతో సినిమా చేసి సక్సెస్ సాధిస్తే ఆయ‌న మార్కెట్ మరింతగా పెరుగుతుంది. అలాగే ఆయనకు మరికొంతమంది స్టార్ హీరోస్ ఆఫర్లు ఇస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆయన మార్కెట్ బాగా పడిపోతుంది. అందుకే తనను తాను ప్రూవ్ చేసుకోవాలని వశిష్ట కూడా అహర్ని శ్రమిస్తున్నాడట. చిరు కూడా బోళా శంకర్ సినిమాతో డిజాస్టర్ ను ఎదుర్కొన్నాడు. దీంతో వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా సక్సెస్ ఇద్దరికీ చాలా కీలకంగా కానుంది. ఇక ఇప్పటికే పాన్ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకునే విధంగా వశిష్ట సినిమాను తెరకెక్కించాడా..? లేదా..? అనేది తెలియాలంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.