పుష్ప2 మానియా.. ఈ బుడ్డోళ్లు ఏం చేశారో చూడండి.. వావ్ అనాల్సిందే..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పుష్ప 2 మానియానే ఎక్కువగా కొనసాగుతుంది . మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప సినిమాకి సంబంధించిన ఒక టీజర్ ని రిలీజ్ చేశారు . ఆ టీజర్ లో పట్టు చీర కట్టుకొని మెడలో పూలమాల వేసుకొని ..ఒంటినిండా నగలతో అల్లు అర్జున్ అద్దిరిపోయే లుక్స్ లో కనిపించారు . సినిమాకే ఈ గంగమ్మ జాతర సీన్ హైలైట్ గా మారిపోతుంది అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది . అయితే కొంతమంది పిల్లలు కూడా పుష్ప2 కి స్పూఫ్ చేస్తున్నారు .

రీసెంట్గా సోషల్ మీడియాలో కొంతమంది పిల్లలు చేసిన పుష్ప2 టీజర్స్ స్పూఫ్ వైరల్ గా మారింది. అచ్చుగుద్దినట్టు అల్లు అర్జున్ లాగే రెడీ అయ్యి అదే విధంగా పుష్ప2 టీజర్ ను రీ క్రియేట్ చేశారు . దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . అంతేకాదు చాలామంది ఈ పిల్లల ఇంట్రెస్ట్ చూసి పొగిడేస్తున్నారు . అంతేకాదు పుష్ప మూవీ టీం కూడా దీనిపై స్పందించడం గమనార్హం.

చాలా చాలా బాగుంది.. మీ హార్డ్ వర్క్ రియల్లీ గ్రేట్ అంటూ వాళ్ళను పొగిడేసారు . కేవలం ఒక్క నిమిషం పాటు ఉన్న పుష్ప2 టీజర్ యూట్యూబ్లో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే . మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ పిల్లలు చేసిన సాహసం చూసి వాళ్ళ టాలెంట్ ని మెచ్చుకోండి. పుష్ప2 పిల్లల స్పూఫ్ టీజర్ చూసి ఎంజాయ్ చేయండి.
ఒక్కటి మాత్రం నిజం పుష్ప2 సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ రేంజ్ లో నరా నరాల్లోకి ఎక్కిస్తూ ఉంటే పుష్ప2 సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా జనాలు ఏ రేంజ్ లో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారో..ఈ సినిమా సీన్స్ ని రీ క్రియేట్ చేస్తారో.. పాటలను ట్రెండ్ చేస్తారో ఊహించుకుంటుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి..!!