నటుడిగా ఎంట్రీ ఇవ్వనున్న లోకేష్ కనగరాజ్.. ఆ స్టార్ బ్యూటీ తో రొమాన్స్..

కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగ‌రాజ్‌ వరుస హిట్ సినిమాలను తెరకెక్కిస్తూ స్టార్ డైరెక్టర్గా దూసుకుపోతున్నాడు. కాగా ఈయన మొదటిసారి సిల్వర్ స్క్రీన్ పై నటించబోతున్నాడు. అది కూడా గోల్డెన్ బ్యూటీ శృతిహాసన్ తో రొమాన్స్ చేయబోతున్నాడట. అయితే ఇది సినిమాలో కాదు ఓ మ్యూజిక్ వీడియో ద్వారా లోకేష్ కనగ‌రాజ్‌ నటుడుగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రేమ గొప్పదానాన్ని చెబుతూ సాగే ఓ మ్యూజిక్ వీడియోలో లోకేష్ న‌టిస్తున్నాడు. లోకేష్‌కు జోడీగా శృతిహాసన్ నటిస్తోందట‌.

Shruti Haasan | Shruti Haasan and Lokesh Kanagaraj team up for Raaj Kamal  Films International project - Telegraph India

ఈ పాటను శృతిహాసన్ స్వయంగా రాయడమే కాదు.. దీనికి మ్యూజిక్ కూడా శృతిహాసన్ అందిస్తుంది. కూతురు మ్యూజిక్ ఆల్బమ్ కు కమల్ హాసన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నాడు. తన ప్రొడక్షన్ హౌస్ రాజకమల్ ఇంటర్నేషనల్ ద్వారా ఈ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేయనున్నారు. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న శృతిహాసన్, లోకేష్ కనగ‌రాజ్‌ మ్యూజిక్ వీడియో సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. గురువారం చెన్నైలో ఈ మ్యూజిక్ వీడియో షూటింగ్ ప్రారంభం కానుంది. రెండు రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకోనున్నారు.

Shruti Haasan and Lokesh Kanagaraj join forces for a Kamal Haasan backed  project - India Today

ఈ మ్యూజిక్ వీడియోలో లోకేష్, శృతిహాసన్ కెమిస్ట్రీ హైలెట్గా ఉండబోతుందట. ఇక ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్గా దూసుకుపోతున్న లోకేష్ కనగ‌రాజ‌న్‌కు హీరోగా చాలా అవకాశాలు వస్తున్న డైరెక్టర్‌గా బిజీగా ఉండడంతో రిజెక్ట్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక కే జి ఎఫ్ స్టంట్ మాస్టర్ అనుబ్ రువ్‌ డైరెక్టర్గా ఎంట్రీ ఇవ్వబోతున్న సినిమాలో లోకేష్ కనగ‌రాజ్‌ హీరోగా నటించబోతున్నట్లు సమాచారం. ఇక ఇటీవల సలార్ తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న శృతిహాసన్.. హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. అలానే ఇంగ్లీష్ లో కూడా ది ఐ పేరుతో ఓ సినిమాలో నటిస్తుంది.