షూటింగ్ మొదలుకాకుండానే రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ విశ్వంభర ‘.. అది చిరంజీవి మార్క్..

మెగాస్టార్ చిరంజీవి గతంలో ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య, ఖైదీ నెంబర్ 150 తప్ప‌ మిగతా సినిమా లేవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక చివరిగా చిరు నటించిన భోళా శంకర్ కూడా చిరంజీవికి కలిసి రాలేదు. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి ఆచితూచి కథ‌లను ఎంచుకుంటున్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం చిరంజీవి – వశిష్ట కాంబినేషన్లో ఓ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమా సోషియా ఫాంటసీ డ్రామాగా ముల్లోకాల నేపథ్యంలో రూపొందుతుంద‌ని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది. తను ఫిబ్రవరి 1 నుండి విశ్వంభరా సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు చిరంజీవి వివరించారు. సుమారు రెండు వారాలు ఈ సినిమా షూటింగ్లో చిరంజీవి పాల్గొనబోతున్నాడట. అయితే కొన్ని రోజుల క్రితం ఈ సినిమాపై అంచనాలను పెంచేందుకు మేకర్స్ ఓ టీజర్ ను రిలీజ్ చేశారు. అది నెట్టింట తెగ వైరల్ అయింది.

ఈ నేపథ్యంలో సినిమా బిజినెస్ మొదలైపోయింది. ఆల్రెడీ ఓవర్సీస్ రైట్స్ ని రికార్డ్ ప్రెస్ కు అమ్మేసినట్లు ట్రేడ్ వర్గాలు నుంచి అందుతున్న సమాచారం. ఇక ఈ సినిమా 2025 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. యూ వి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకేక్కుతున్న ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు రూ.18 కోట్లకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. చిరంజీవికి ప్రస్తుతం వరుస ప్లాప్‌లు ఎదురవుతున్న నేపథ్యంలో.. ఇంకా షూటింగ్ మొద‌లు కాని సినిమాకు ఇంత భారీ రేంజ్ లో ఓవర్ సిస్ హక్కులు అమ్ముడుపోవడం అంటే అది ఓ రికార్డు అనే చెప్పాలి.

సరిగమ సినిమాస్ ఈ రైట్స్ ను సొంతం చేసుకుందట. ఇటీవల ఇలాంటి ఫాంటసీ సినిమాలు ప్రేక్షకులను భారీ ఆకట్టుకుంటున్నాయి. దానికి ఉదాహరణ ఇటీవల రిలీజైన హనుమాన్. ఇక uv క్రియేషన్స్ బ్యానర్ పై ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ విశ్వంభరా కు భారీ రేంజ్ లో విఎఫ్ఎక్స్ వర్క్ జరగబోతున్నాయట. విశ్వంభరా విజువల్స్ వండర్ క్రియేట్ చేయబోతున్నాయని తెలుస్తుంది. రూ.200 కోట్లు బడ్జెట్ తో ఈ మూవీ రూపొందిస్తున్నారట.