‘ దేవర ‘ సినిమాల్లో.. ఐటెం గర్ల్ గా ఆ స్టార్ బ్యూటీ.. బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిందే..

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి క్యారెక్టర్ నైనా అలవోకగా చేసి ముప్పించగల సత్తా ఉన్న నటులలో మొదటి వరుసలో జూనియర్ ఎన్టీఆర్ పేరే వినిపిస్తుంది. ఇక తాత సీనియర్ ఎన్టీఆర్‌కు తగ్గ మనవడిగా క్రేజ్‌ సంపాదించుకున్న ఎన్టీఆర్.. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. ఆర్ఆర్ఆర్‌ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో ఎన్టీఆర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఎన్టీఆర్ ఉన్నాడు.

దానికి తగ్గట్టుగానే ఈ సినిమా డైరెక్టర్ కొరటాల శివ కూడా చాలా అద్భుతంగా సినిమాలు తుర‌కెక్కిస్తున్నట్లు సమాచారం. రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్ చూస్తే కొరటాల శివ ఆచార్య ప్లాప్ తర్వాత ఈ సినిమాను చాలా కష్టంగా తీసినట్లు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చేయడమే లక్ష్యంగా కొరటాల శివ కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఐటమ్ గర్ల్‌గా చేయడానికి ఇప్పుడిప్పుడే టాలీవుడ్ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంటున్న మీనాక్షి చౌద‌రిని తీసుకుంటున్నట్లు సమాచారం.

గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన ఈమె ఈ సినిమాలో తను నటనకు గుర్తింపు తెచ్చుకుంది. దీంతో దేవర సినిమాకు ఐటెం గర్ల్ గా కొరటాల శివ ఆమెను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ఆ సాంగ్ ఎంత స్పెషల్ గా ఉండబోతుందట. సినిమాకే హైలెట్ గా నిలవబోతుందని సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో మీనాక్షి పాత్ర క‌నుక క్లిక్ అయి స‌క్స‌స్ వ‌స్తే ఇక ఆమెకు లాట్రీ త‌గిలిన‌ట్టే అవుతుంది. మరిన్ని అవకాశాలు దక్కించుకునే ఛాన్స్‌లు ఉన్నాయి.