ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ తో కలిసి ‘ హనుమాన్ ‘ మూవీ వీక్షించిన బాలయ్య.. ఏం చెప్పారంటే..?

సంక్రాంతి పండుగ కానుకగా హనుమాన్ సినిమా సంచ‌ల‌నం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తేజా సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సూపర్ హీరో సినిమాకు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రేంజ్ లో పాజిటీవ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లు తక్కువగా కేటాయించిన.. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన హనుమాన్.. ప్రస్తుతం టాలీవుడ్ లో పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ఇక ప్రేక్షకులతో పాటు, పలువురు ప్రముఖులు కూడా ఈ సినిమాను వీక్షించి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా నందమూరి నట‌సింహం బాలకృష్ణ హనుమాన్ సినిమాని చూశారు. హైదరాబాద్ సిటీలోని ప్రసాద్ ల్యాబ్‌లో బాలయ్య కోసం హనుమాన్‌ స్పెషల్ షో ప్రదర్శించారు. హీరో తేజ సర్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఈ స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరై సందడి చేశారు. సినిమాను చూసిన బాలయ్య చాలా హ్యాపీగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది.

తేజ, ప్రశాంత్ వర్మలతో పాటు మొత్తం టీంను అభినందించినట్లు.. సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని రివ్యూ ఇచ్చార‌ట బాల‌య్య‌. ఇక వీరితో పాటే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా హనుమాన్ సినిమాను చూశారు. మంగళవారం జ‌న‌వ‌రి 16న‌ తన సతీమణి గీతా శివరాజ్ కుమార్ తో కలిసి కన్నడలో సినిమా చూసిన ఆయన.. తేజ పై ప్రశంసల వర్షం కురిపించారు. తన పిల్లలకు కూడా హ‌నుమాన్ చూపిస్తాను అంటూ కామెంట్ చేశారు.