” అన్నదమ్ములు ఇద్దరు సేమ్ “… మెగా హీరోలపై ఘాటు వ్యాఖ్యలు చేసిన కేతిక శర్మ..!

మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అందులో ఒకరు సాయి ధరమ్ తేజ్. ” రేయ్ ” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈయన ” సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ , సుప్రీమ్, చిత్రలహరి, ప్రతిరోజు పండగే ” వంటి హిట్స్ తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు.

ఇక ఈయన ఒక్క సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిగత విషయంలో కూడా చాలా మంచి మనిషి. ఈయనతో కలిసి పని చేసినటువంటి సెలబ్రిటీలను కనుక మనం ప్రశ్నిస్తే ఈయన గురించి ఏదో ఒక ట్యాగ్ ఇస్తూ ఉంటారు. అయితే హీరోయిన్ కేతిక శర్మ సాయి ధర్మ తేజ్ తో మాత్రమే కాకుండా వైష్ణవ్ తేజ్ తో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఈ ఇద్దరు హీరోలపై కొన్ని ఆసక్తి కామెంట్లు చేసింది.

ఈమె మాట్లాడుతూ..” వైష్ణవ్ తో నేను చాలా సరదాగా ఉండేదాన్ని. ఇద్దరం చిన్న పిల్లలు మాదిరి కొట్టుకునే వాళ్ళం. ఇక సాయి ధరమ్‌ తేజ్ కూడా చాలా సరదాగా ఉంటాడు. కానీ ఒకా మాటలో చెప్పాలి అంటే ఇద్దరిలో సాయి ధరమ్ తేజ్ హస్బెండ్ మెటీరియల్ ” అంటూ కామెంట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం కేతిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.