ఆ సినిమాలో పాట పాడనున్న పవన్.. ఒక్కొక్కడికి పూనకాలే అంటున్న ఫ్యాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన తాజాగా నటిస్తున్న సినిమాలలో ” ఓజి ” సినిమా ఒకటి. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలపై పవన్ అభిమానులతో పాటు, ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ కొంతమేర కంప్లీట్ అయ్యి ఇప్పుడు బ్రేక్లో ఉంది. ఇక ఈ భారీ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని పవన్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక అసలు మేటర్ ఏంటంటే.. ఈ సినిమా విషయంలో సంగీత దర్శకుడు థమన్ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో మళ్లీ చాలా కాలం తర్వాత పవన్ తన గాయం అందించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో పవన్ నే స్వయంగా పాట పడనున్నాడట. ఇక ఈ వార్త విన్నపవన్‌ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఇదే కనుక నిజమైతే ఒక్కొక్కడికి పూనకాలే అని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ వార్తపై త్వరలోనే క్లారిటీ సైతం రానుంది.