మహేష్ ఇంట ‘ గుంటూరు కారం ‘ టీం స్పెషల్ పార్టీ.. థమన్, త్రివిక్రమ్ రాకపోవడానికి కారణాలు ఏంటో తెలుసా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన మూవీ గుంటూరు కారం. ఈ మూవీ రిలీజ్ అయి వచ్చిన రిజల్ట్ తో టీమ్ అంతా సంతృప్తిగా ఉన్నారు. గుంటూరు కారం సినిమాకి సంబంధించిన కీలక సభ్యులు.. నిన్న మహేష్ ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్లో హాజరయ్యారు. అయితే త్రివిక్రమ్, థమన్ మాత్రం ఈ పార్టీలో హాజరు కాలేదు. అయితే వీరిద్దరూ హాజరు కాకపోవడానికి కారణం ఏంటా అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ సంక్రాంతి పండుగకు సొంత ఊరు వెళ్లారని అందుకే హాజరు కాలేదని సమాచారం.

థమన్ చెన్నైలో ఉండడం వల్ల ఈవెంట్ కు హాజరు కాలేదట. అయితే గుంటూరు కారం సినిమాకు నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ. 83.7 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగులో మాత్రమే విడుదలైన ఈ సినిమా అంచనాలను మించి కలెక్షన్లు సొంతం చేసుకోవడంతో టీమ్ అంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరో రూ.47 కోట్ల కలెక్షన్స్ సాధిస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది. సిడెడ్ లో ఈ సినిమా కలెక్షన్లు పుంజుకోవాల్సి ఉండగా ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి. ఓవర్సీస్ లో కూడా గుంటూరు కారం మూవీ మంచి కలెక్షన్లనే సాధిస్తూ ముందుకు వెళుతుంది.

ss thaman: Latest News, Videos and Photos of ss thaman | The Hans India -  Page 1

ఇతర రాష్ట్రాల్లో సైతం సినిమా బుకింగ్ విషయంలో అదరగొడుతుంది. హైదరాబాదులో రికార్డ్ స్థాయిలో స్క్రీన్ లపై ప్రదర్శిస్తున్నారు. ఇక ఈ సినిమా సెకండ్ వీకెండ్ కూడా క్యాష్ చేసుకుని అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. ఈ మూవీలో మహేష్ బాబు లుక్స్ అదిరిపోయాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా కథ మొత్తం మహేష్ భుజాల పైన నడిచిందట.. శ్రీ లీల డ్యాన్స్ స్కిల్స్ కు ప్రేక్షకుల్లో మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమాకు బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు ఏ విధంగా ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. మహేష్ భవిష్యత్తు సినిమాలన్నీ పాన్ ఇండియా లెవెల్ లోనే ఉండబోతున్నాయి. ఇక మహేష్ రమ్యునరేషన్ ప్రస్తుతం భారీగా ఉంది. ఇక పాన్ ఇండియా లెవెల్ సినిమాలు మొదలు పెడితే మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.