ఆ పవర్ ఫుల్ స్టార్ హీరో వల్లే ‘ హనుమాన్ ‘ మూవీ హిట్ అయిందా? బయటపడ్డ సీక్రెట్..

యంగ్ హీరో తేజ సజ్జ‌ హీరోగా.. టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్టార్ యాక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ తేజ అక్కగా నటించింది. అమృత అయ్య‌ర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ సక్సెస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా 12న రిలీజ్ చేసేందుకు ఇండస్ట్రీ నుండి వీరికి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని.. స్వయంగా సినిమా డైరెక్టర్, హీరో చెప్పుకొచ్చారు. ఇక అదే రోజు గుంటూరు కారం మూవీ కూడా రిలీజ్ ఉంది.

Hanu Man (2024) - IMDb

అయితే ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో, స్టార్ నిర్మాతల సినిమా కావడంతో సినిమాకు సంబంధించి దిల్ రాజు, నాగ వంశి ఇద్దరూ హనుమాన్ మూవీని రిలీజ్‌కు ఎన్నో విధాలుగా అడ్డుపడ్డారని వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి స్పందించిన దిల్ రాజు ఎలా పడితే అలా నోటికి వచ్చినట్లు పిచ్చిపిచ్చి చెత్త వార్తలు రాస్తే బాగుండదు అంటూ ఫైర్ అయ్యాడు. అయినా దిల్ రాజు పై ఈ వార్తలు ఆగలేదు. ఇక హనుమాన్ మూవీ రిలీజ్ కాకుండా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ నిర్మాత, డైరెక్టర్ పట్టుదల వల్లే ఈ సినిమా సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ గా నిలిచిందని టాక్ ఉంది. ఈ సినిమాని ఒక టైం లో ఇండస్ట్రీ నుంచి వస్తున్న టార్చర్ భ‌రించలేక వాయిదా వేయాలని కూడా మేకర్స్ భావించారట.

Pawan Kalyan takes a tough call | cinejosh.com

కానీ చివరి ఆప్షన్ గా పవన్ కళ్యాణ్ ని కలుద్దామని చూశారట. అలా పవన్ ని కలిసిన తర్వాత ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలను వివరించి తమ సినిమా ఎలాగైనా రిలీజ్ అవ్వాలని కోరుకున్నారట. హనుమాన్ సినిమాకు నిర్మాతగా చేసిన సూర్యదేవర నాగవంశీ నుంచి పవన్ కు చాలా దగ్గర స్నేహితుడు కావడంతో.. పవన్ కళ్యాణ్ కి ఆయన చెప్పేసరికి ప్రొడ్యూసర్ దిల్ రాజు, నాగ వంశీని పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేసి సినిమా సంక్రాంతి బరిలోనే రిలీజ్ అయ్యేలా చేశాడట ప‌వ‌న్‌. దీంతో హనుమాన్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ కూడా ఒక కారణమని తెలిసిన ఫ్యాన్స్.. పవన్ కళ్యాణ్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు.