‘ హనుమాన్ ‘ సెన్సేషనల్ రికార్డ్.. నాలుగు రోజుల్లో రూ.100 కోట్లు..

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా తెరకెక్కిన మూవీ హనుమాన్. స్టార్ యాక్ట‌రస్‌ వరలక్ష్మి శరత్ కుమార్.. తేజ అక్కగా, అమృత అయ్య‌ర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా రిలీజ్ కి ముందే ప్రేక్షకులో భారీ హైట్ ను తెచ్చుకుంది. సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బ‌స్ట‌ర్‌ కలెక్షన్లతో దుమ్మురేపుతుంది.

తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ మూవీ అద్భుతమైన విజువల్స్, గ్రాఫిక్స్ అందించడంపై తెలుగు ప్రేక్షకులే కాదు.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభ‌మానులంతా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ‌ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇప్పటికే బుక్ మై షో లో అత్యధిక టికెట్లు కొనుగోలు అయిన సినిమాగా.. హనుమాన్ రికార్డును క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందులో భాగంగానే మరో రేర్ రికార్డును హనుమాన్ తన ఖాతాలో వేసుకుంది.

సినిమా రిలీజ్ అయి నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. అగ్ర హీరోల సినిమాలను కూడా దాటుకుంటూ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా టికెట్ రేట్లు కూడా పెంచకుండానే.. కేవలం నాలుగు రోజుల్లో రూ.100 కోట్ల వసూలు చేయడం అంటే సాధారణ విషయం కాదు. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాలో ఇది నా తొలి సెంచరీ అంటూ తన ఆనందాన్ని ట్విట్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.