” గుంటూరు కారం ” మూవీ స్టోరీ లీక్.. సినిమాలో మహేష్ పాత్ర ఇదే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మాస్ మసాలా మూవీ ” గుంటూరు కారం “. శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అన్ని కూడా ప్రేక్షకులని ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీ స్టోరీ లీక్ అయిందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ ఔట్ అండ్ ఔట్ పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ లో ఉంటుందట.

గుంటూరు కారం సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు వెంకటరమణా రెడ్డి పాత్రలో కనిపించనున్నాడట. పాలిటిక్స్ అంటే ఇష్టం లేని వెంకటరమణా రెడ్డి తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని రాజీకియపరంగా ఉన్న శత్రువులను ఎలా ఎదుర్కొంటాడనేదే గుంటూరు కారం మూవీ కదా అని ఓ న్యూస్ వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.