ఆ స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడం లేదు.. మణిశర్మ అవేద‌న క‌రెక్టేనా..

టాలీవుడ్ ప్రేక్షకులకు మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మహేష్ దగ్గర నుంచి పవన్, చిరంజీవి లాంటి అందరూ స్టార్ హీరోలకు వాళ్ళ కెరీర్‌లో గుర్తుండిపోయే సాంగ్స్ అందించిన మణిశర్మ.. ఇప్పుడు అడ‌పాద‌డ‌పా సినిమాల‌లో, చిన్న‌ హీరోల సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిశర్మ మాట్లాడుతూ తనకు స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వడం లేదంటూ ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఏ విషయంలోనైనా హర్ట్ అవుతున్నారా అంటూ యాంకర్ ప్రశ్నించగా దానికి మణిశర్మ సంచాల‌న కామెంట్స్ చేశారు.

DSP summons fans of Pawan Kalyan and Mahesh Babu over poster controversy

మ‌ణిశ‌ర్మ మాట్లాడుతూ హర్ట్ అయ్యేందుకు కారణం ఉందంటే మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలు అందరికీ ఒక్కో ఛాన్స్ ఇవ్వవచ్చు. అలా అని నాకే ఇవ్వాలని అనట్లేదు. ఒక్కొక్కరికి తలా ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. జనాలు కూడా వెరైటీగా ఫీలవుతారు. దేవికి ఓ సినిమా, నాకో సినిమా, థ‌మన్ కి ఓ సినిమా.. పోనీ వాళ్లకు రెండు ఇచ్చి నాకు ఒక్కటే ఇవ్వండి.. అలా పంచితే అందరికీ వెరైటీగా ఉంటుంది. ఇది నా వరకు నేను అనుకునేది. ఈ ఒక్క విషయంలోనే నేను కాస్త ఫీల్ అవుతాను.. నేను వాళ్లతో వెళ్లి చెప్పలేదు.. ఎవరితో చెప్పలేను అంటూ మణిశర్మ తన మనసులోని ఆవేదనను వ్యక్తం చేశాడు.

Mani Sharma : ఆ ఇద్దరి స్టార్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మణిశర్మ.. - NTV Telugu

1998 నుంచి 2010 వరకు మంచి ఫామ్ లో కొనసాగిన మణిశర్మ తర్వాత పాటల పరంగా చాలా స్లో అయ్యాడు. అదే టైంలో దేవి శ్రీ‌ ప్రసాద్, థ‌మన్ లాంటివాళ్ళు ఫామ్ లోకి వచ్చారు. మధ్యలో ఇస్మార్ట్ శంకర్‌తో మణిశర్మ జోరు కాస్త చూపించిన ఆ జోష్‌ సరిపోలేదు. అలానే ట్రెండ్ కు తగ్గ పాటలు చేయడం లేదని మణిశర్మ పై కాస్త విమర్శలు కూడా వచ్చాయి. ఈ కారణంగా కూడా స్టార్ హీరోలు ఈయనకు ఛాన్సులు ఇచ్చి ఉండకపోవచ్చు. ఈయన బాధపడడంలో తప్పులేదు. కానీ ఈయన అవేద‌న‌తో మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలు పిలిచి ఛాన్సులు ఇస్తారా అని మాత్రం అనుకోలేము.