ఈగిల్ మేకర్స్‌కు బిగ్ షాక్.. సంక్రాంతి బరిలో మాస్ మ‌హ‌రాజ్ వెన‌కు త‌గ్గేనా..?

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఈగిల్. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాఫ‌ర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై డీజే విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. జనవరి 13న సినిమా రిలీజ్ కానున్న‌ట్లు మేకర్స్ ప్రకటించారు. శ్రీనివాస్, వినయ్ రాయ్, ప్రణతి పట్నాయక్, శ్రీనివాస్ రెడ్డి, శివ నారాయణ, న‌వ‌దీప్‌ లాంటి స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా రిలీజ్ తేదీ పై ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి.

Ravi Teja Eagle Shooting Completed, Theatres In 50 Days

మూవీ మేకర్స్ చాలా దగ్గర వాళ్లే మేకర్స్ కు గట్టి షాక్ ఇస్తున్నారని టాక్. ఇలాంటి పరిస్థితుల్లో రవితేజ ఈగిల్ సినిమా సంక్రాంతి బరిలో తప్పుకుంటుందా.. లేదా మేకర్స్‌ ప్రకటించినట్లుగానే సినిమా రిలీజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో రవితేజ ఈగిల్‌తో పాటు.. సూపర్ స్టార్ మహేష్ గుంటూరు కారం, నాగార్జున.. నా స్వామి రంగా, తేజ.. హనుమాన్, విక్టరీ వెంకటేష్.. సైంధవ్‌ సినిమాలు వరుసగా పోటాపోటీగా రిలీజ్ కానున్నాయి. అలాగే ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయ అయాలన్‌ సినిమాలు కూడా థియేటర్‌లో సందడి చేయబోతున్నాయి.

ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ మూడు రోజులు 8 సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఏ ఒక్కరు కూడా తగ్గుకుండా పోటీపడేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే టైగర్ నాగేశ్వరరావు ఫ్లాప్ అయినా రవితేజ మాత్రం ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతానని కాన్ఫిడెంట్ తో వున్నాడు. ఎంత పోటీ ఉన్నా సరే సంక్రాంతి బారిలోనే ఈగిల్‌ను రిలీజ్ చేస్తామని మేకర్స్ కూడా ప్రకటించారు. మరో 10 రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న ఈ మూవీ తేదీని మార్చుకోవాలని, ముఖ్యంగా సంక్రాంతి బరి నుంచి తప్పించాలని మేకర్స్‌కి ఎన్నో హెచ్చరికలు వస్తునాయ‌ట‌.

Eagle trailer released: Ravi Teja plays a wanted man on a mission -  Hindustan Times

సన్నిహితులు, దగ్గర వాళ్లే సినిమా విడుదలను వాయిదా వేయమని చెబుతున్నా.. తాము తగ్గమని చెప్పేసినట్లు తెలుస్తుంది. అయితే మేకర్స్ కు చాలా దగ్గర వాళ్లకు అయిన కూడా ఇలా సూచించడం మాత్రం ఆపట్లేదట. మరి దర్శక, నిర్మాతలు కానీ రవితేజ కానీ ఈ సినిమా విడుదలపై ఏమైనా మనసు మార్చుకుంటారా.. లేక అన్ని సినిమాలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతారా అనేది మేకర్స్ క్లారిటీ ఇస్తే గాని తెలియదు.