చిరంజీవి సినిమాకు బాలీవుడ్ నుంచే కాదు.. ఆ రెండు ఇండస్ట్రీలో నుంచి మరో ఇద్దరు హీరోయిన్స్..

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయన రేంజ్ కు తగ్గ హీట్ ఒకటి కూడా రాలేదని చెప్పాలి. ఈ మధ్య వచ్చిన వాల్తేరు వీర‌య్య‌తో సక్సెస్ సాధించిన ఆ సినిమా కూడా చాలా కామన్ గానే అనిపించింది. ఇక ఖైదీ నెంబర్ 150 నుంచి ప్రస్తుతం చిరంజీవి చేసిన సినిమాలు ఏవి ఆయన ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా అనిపించలేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ బింబిసార డైరెక్టర్ వశిష్ట డైరెక్షన్లో విశ్వంభ‌రా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బింబిమిసార లాంటి సోషియా ఫాంటసీ సినిమాను వశిష్ట చాలా క్లియర్ కట్గా తీర్చిదిద్దాడు. ఇప్పుడు మెగాస్టార్‌తో తీస్తున్న సినిమా కూడా సోషియ ఫాంటసీల్ లైన్ పైనే రూపొందించ‌డం.. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుండడంతో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Deepika Padukone rumoured to be a part of Megastar Chiranjeevi's next

ఇక ఈ సినిమా షూటింగ్ ఇటీవల యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై గ్రాండ్గా మొదలుపెట్టారు. ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మేకర్స్ ఏకంగా రూ.200 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నారని సమాచారం అందుతుంది. ఈఏడాదిలోనే సినిమా ప్రేక్షకులు ముందుకు రానంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి సెలబ్రేషన్స్ లో భాగంగా మూవీ క్లిప్స్ రిలీజై అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ముల్లోకాల కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా ముగ్గురు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. నిన్న మొన్నటి వరకు నయనతారను హీరోయిన్గా ఫిక్స్ చేసేందుకు మూవీ టీం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపించాయి.

Trisha topples Nayanthara to become numero uno in Kollywood? - India Today

త్రిష కూడా ఈ సినిమాలో ఉన్నట్లు గట్టిగా అనిపించింది. కాగా ఇప్పుడు మరో వార్త వైరల్ అవుతుంది. చిరంజీవి స‌ర‌సన నటించడానికి ఏకంగా బాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ దీపిక పదుకొనేను రంగంలోనికి దింపేందుకు మేకర్స్ రెడీ అయ్యారట. ఈ మేరకు దీపికతో చిత్రం బృందం చర్చలు కూడా చేశారు. దానికి దీపిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు వినిపించాయి. ఇక తాజాగా ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో.. ఒక్కో ఇండస్ట్రీకి చెందిన ఒక్క హీరోయిన్ తీసుకుంటే ప్రమోషన్ సహాయపడతారని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నారని టాక్. అందులో భాగంగానే బాలీవుడ్ నటి దీపిక పదుకొనేను మూవీ టీం సంప్రదించారట. మరి మిగతా ఇద్దరు హీరోయిన్లుగా నయనతార, త్రిషని ఫిక్స్ చేస్తారా.. వేరే ఎవరినైనా తీసుకుంటారో వేచి చూడాలి.