‘ హనుమాన్ ‘ బ్లాక్ బస్టర్ సక్సెస్ స్పందించని టాలీవుడ్ స్టార్స్.. ఇది కరెక్టేనా..

రెండు తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ మూవీ బుకింగ్స్ బ్లాస్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బుకింగ్స్ అంతకంత‌కు పెరిగిపోతూనే ఉన్నాయి. థియేటర్ సంఖ్య పెంచితే హనుమాన్ మూవీ కలెక్షన్లు విషయంలో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రేక్ష‌కులు. ఇప్పటికే మెజార్టీ ఏరియాలో బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను హనుమాన్ రీచ్ అయిపోయింది. హనుమాన్ మూవీ నిర్మాత నిరంజన్ రెడ్డి సినిమాతో భారీ లాభాలను గడించడం ఖాయమని అర్థమవుతుంది.

Hanu Man - Wikipedia

హనుమాన్ సినిమా సక్సెస్ తో జై హనుమాన్ సినిమాకు సీక్వెల్ తర్కెక్కించే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఈ సినిమా బిజినెస్ స్టార్ హీరోల సినిమాలు బిజినెస్ రేంజ్ లో జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని టాక్. హనుమాన్ సినిమా సక్సెస్ సాధించడంతో ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కెరీర్‌లో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అయితే హనుమాన్ ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరు ఈ సినిమా గురించి రియాక్ట్ కాలేదు.

Jai Hanuman: What's the 2025 Plan? - TeluguBulletin.com

సినిమా విషయంలో ఇంత కఠినంగా స్టార్స్ వ్యవహరించడం మంచి పద్ధతి కాదు అంటూ చిన్న సినిమాల సక్సెస్ సాధించడం అరుదుగా జరుగుతుంది. అలా సక్సెస్ సాధించిన టైంలో స్టార్స్ ప్రశంసలు లభిస్తే ఆ సినిమా కలెక్షన్లు మరింతగా పుంజుకుంటాయి. కానీ సంక్రాంతి బారిలో బ్లాక్ బ‌స్టర్ గా కొనసాగుతున్న హనుమాన్ సినిమాపై ఎవరు తమ ఒపీనియన్ తెలియజేయలేదు. ఇక ఏదేమైనా ఈ ఏడాది భారీ లాభాలను అందించిన తెలుగు సినిమాలలో ఒకటిగా హనుమాన్ ఉంటుంది అనడంలో సందేహం లేదు.