” హనుమాన్ 2 ” పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

చిన్న సినిమాగా విడుదలై భారీ స్థాయిలో రికార్డ్ సృష్టించిన సినిమా ” హనుమాన్ “. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇక గుంటూరు కారంతో పోటీపడిన ఈ మూవీ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఒక స్టార్ హీరో సినిమాని కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అంతటి అసాధ్యాన్ని సాధ్యం చేశారు హనుమాన్ టీం.

ఇక ప్రస్తుతం ఈ మాసివ్ ఎంటర్టైనర్ ఎక్కడెక్కడ థియేటర్స్ లో ఉందో అన్నిచోట్ల నేషనల్ రన్ ని కొనసాగిస్తుంది. ఇక ఈ మూవీ సీక్వెల్ ” ది హనుమాన్ ” కోసం కూడా చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ సీక్వెల్ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తుంది.

దీని ప్రకారం ఈ సినిమాలో హనుమాన్ తేజ సజ్జ సహా భజరంగ్ హనుమంతుని పై కూడా కలిపి ఫుల్ ఫ్లేడ్జ్ సన్నివేశాలు ఉంటాయని అలాగే మొదటి భాగంలో చూపించిన విధంగా కాకుండా హనుమంతుని రియలిస్టిక్ వర్షంలో ప్రశాంత్ వర్మ ప్రజెంట్ చేస్తాడని తెలుస్తుంది. మొత్తానికైతే హనుమాన్ పార్ట్ 2 మరింత భారీగా ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ.