” ఫిబ్రవరి 9 నుంచి మన పండగ జరుపుకుందాం “.. రవితేజ ఇంట్రెస్టింగ్ ట్వీట్..!

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కనున్న మూవీ ” ఈగిల్ “. ఈ సినిమా కోసం మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ థియేటర్లు లేకపోవడంతో తమ సినిమాని షెడ్యూల్ చేసుకున్నారు.

ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ కథానాయకులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మాస్ మహారాజ్ రవితేజ..” ఫిబ్రవరి 9 నుంచి థియేటర్లలో ఈగల్ తో మన పండగను జరుపుకుందాం.

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం రవితేజ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈనట్వీట్ చూసిన అభిమానులు..” ఈగల్ తప్పకుండా హిట్ అవుతుంది అన్న. మీ మీద మాకు నమ్మకం ఉంది. ఐ యాం ఆల్వేస్ యు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.