” దారుణమైన కామెంట్స్ తో నన్ను అలా ఇబ్బంది పెడుతున్నారు” … రీతూ చౌదరి ఎమోషనల్ కామెంట్స్…!

జబర్దస్త్ అనే కామెడీ షో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. ఇలా జబర్దస్త్ ద్వారా పాపులారిటీ దక్కించుకున్న వారిలో రీతూ చౌదరి ఒకరు. ఈమె పలు బుల్లితెర సీరియల్స్ తో పాటు ఈ కార్యక్రమంలో కమీడియన్ గా నటించి మంచి పాపులారిటీని దక్కించుకుంది. ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అంద చందాలను ఆరబోస్తూ ఉంటుంది.

ఇక ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేసే ఫోటోలు వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. ఇకపోతే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేస్తూ అందులో తన గురించి వస్తున్నటువంటి రోల్స్ పై స్పందించింది. అంతేకాకుండా వీడియోలను మార్ఫింగ్ చేసి తనకే ట్యాగ్ చేస్తున్నారని వాపోయింది. ఇలా నాకు ట్యాగ్ చేసే వరకు వీడియోలను మార్ఫింగ్ చేశారనే విషయం నాకు తెలియదు.

ఈ విషయం జరిగి ఐదు నెలలవుతుందని బయటకి చెప్పాలా వద్దా అంటూ తను ఎంతో కృంగిపోయినట్లు తెలిపింది. అలాగే ఈమె ఏ ఫోటో షేర్ చేసిన బూతు కామెంట్స్ పెడుతున్నారు అంటూ ఎమోషనల్ అయింది. అలాగే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు… ట్రోల్స్ చేస్తున్నారు అంటూ కామెంట్స్‌ చేసింది. ప్రస్తుతం ఈమె కామెంట్స్ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతున్నాయి.