” సలార్ ” మూవీ కోసం తగ్గేదేలే అంటూ భారీ రెమ్యూనరేషన్ అందుకున్న ప్రభాస్… ఏంటి బాసు ఇది..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రభాస్ తాజాగా నటించిన మూవీ ” సలార్ “. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా… ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ప్రభాస్ చేసిన సినిమాలలో చాలావరకు మంచి విజయాలను దక్కించుకోవడంతో… ప్రస్తుతం ప్రభాస్ సలార్ మూవీ కోసం దాదాపు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

అయితే ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న రేంజ్ ప్రకారం 100 కోట్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోవడం సర్వసాధారణం. కానీ బాహుబలి సినిమాకి కేవలం ఈయన 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు కాబట్టి ఈ సినిమాకి కూడా అదే రెమ్యూనరేషన్ తీసుకోవాలి అని అనుకున్నాడట ప్రభాస్. ఇక ప్రస్తుతం ఈ వార్త చూసిన డార్లింగ్ అభిమానులు… మా అన్నది గొప్ప మనసు అంటూ తెగ పొగిడేస్తున్నారు.