” మీ అందరి అంచనాలు రీచ్ అయ్యేలా సలార్ సిజ్ ఫైర్ ఉంటుంది “… విజయ్ కిరగందూర్ సెన్సేషనల్ కామెంట్స్…!

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ యాక్షన్ అండ్ త్రిల్లింగ్ పాత్రలో నటిస్తున్న మూవీ ” సలార్ ” కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మోస్ట్ అవైటెడ్ మూవీ గా అనౌన్స్మెంట్ నాటి నుంచి నేటి వరకు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాని ఈనెల 22 (రేపు) పలు భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఈ నేపథ్యంలోనే నిర్మాత విజయ్ కిరగందూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈయన మాట్లాడుతూ…” ప్రభాస్ ఓ సూపర్ స్టార్. పాన్ ఇండియా రేంజ్ లో ప్రశాంత్ నీల్ పెద్ద డైరెక్టర్.

ఆయనకు ఒక ఇమేజ్ క్రియేట్ అయింది. వీరిద్దరి కాంబోలో వచ్చే ఈ సినిమా తప్పకుండా ఫాన్స్ ని ఆకట్టుకుంటుంది. కేజిఎఫ్ తరువాత ప్రశాంత్ నీల్ ఎలాంటి కథను చూపిస్తాడో… ప్రభాస్ ను ఏ విధంగా చూపిస్తాడో మీకే తెలుస్తుంది. ఈ సినిమాపై మీరు పెట్టుకున్న అంచనాలను ఏ మాత్రం నిరాశ చెయ్యరు ” అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.