అడ్వాన్స్ బుకింగ్ లో ” డంకీని ” తలదన్ని భారీ రికార్డుని నెలకొల్పుతున్న ” సలార్ “… ఎన్ని కోట్లు అంటే…!

ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. దీంతో మేకర్స్ అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేశారు. ఇక ఫాన్స్ పోటాపోటీగా కొనుగోలు సైతం చేస్తున్నారు. రిలీజ్ కి సిద్ధమైన ప్రభాస్ ” సలార్ “… షారుఖ్ ” డంకీ ” మూవీలు తలపడనున్నాయి.

డిసెంబర్ 22న (రేపు) థియేటర్లలో ఈ రెండు సినిమాలు కూడా తలపడనున్నాయి. ఈ క్రమంలోనే అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… ప్రభాస్ సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ తో దూసుకుపోతుంది. షారుఖ్ ఖాన్ డంకీ వెనుకబడి ఉంది.

సలాడ్ సినిమాకి సంబంధించిన టికెట్లు దేశవ్యాప్తంగా 5,54,200కు పైగా అమ్ముడుపోయాయి. ఇక దీంతో రూ. 13.66 కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇక డంకీ విషయానికి వస్తే 3,41,500 టికెట్లు అమ్ముడు పోగా…రూ. 10.70 కోట్లు వచ్చాయట. ఇక షారుఖ్ డంకీ నీ తలదన్ని ప్రభాస్ సలార్ భారీ రికార్డ్ నే నెలకొల్పుతోందనే చెప్పాలి.