ప్రభాస్ వందల కోట్ల విలువైన ఆస్తులకు వారసుడు… బాహుబలి రేంజ్ లో లైఫ్ స్టైల్… గత 8 ఏళ్లలో మారిన లెక్కలు…!

రెబల్ స్టార్ ప్రభాస్ మనందరికీ సుపరిచితమే. ప్రభాస్ తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. బాహుబలి అనే సినిమాతో ఏ రేంజ్ పాపులారిటీని దక్కించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ప్రభాస్ లైఫ్ స్టైల్ ఒక్క బాహుబలి సినిమాలోనే అలా ఉండదు… బయట కూడా ప్రభాస్ లైఫ్ స్టైల్ అలానే ఉంటుందట.

100 కోట్ల విలువైన ఆస్తులకు వారసుడైన ప్రభాస్.. ఇంకా సంపాదిస్తూనే ఉన్నాడు. గత ఎమ్మిదేళ్లలో మారిన ఈయ‌న ఆస్తుల లెక్క విలువ అంతా ఇంతా కాదు. ఈయన పుచ్చుకుంటున్న రెమ్యూనరేషన్ చూస్తే కళ్ళు తేలేయాల్సిందే. ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ప్రభాస్ కి కోట్ల విలువ చేసే కారులు సైతం ఉన్నాయట.

ఇక ఈయనకి హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో రూ. 60 కోట్ల విలువైన ఇల్లు ఉందని లైఫ్ స్టైల్ ఏషియా పేర్కొంది. అలాగే హైదరాబాద్ శివార్లలోని రాయదుర్గ ఖల్సాలో ఫామ్ హౌస్ ఉందట. అలాగే ఇటలీలో ఓ విలాసమంతమైన ఫ్లాట్ ఉందని.. హాలీడే లేనప్పుడు దానికి వచ్చి అద్దే రూ. 4.8 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఆస్తుల విలువ చూసిన ప్రేక్షకులు కళ్ళు తేలేస్తున్నారు.