52 ఏళ్ల వయసు మీద పడుతున్నా కుర్ర హీరోయిన్లకి పోటీ ఇస్తున్న నాగార్జున బ్యూటీ… ఏముంది భయ్యా…!

స్టార్ స్టేటస్ ని దక్కించుకున్న వారిలో టబు ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ముఖ్యంగా నాగార్జున హీరోగా నటించిన నిన్నే పెళ్ళాడుతా సినిమాలో కనిపించి ప్రేక్షకులని మెప్పించింది. ఇక హైదరాబాద్లో పుట్టి ముంబైలో స్థిరపడ్డ ఈమె… నటి ఫరాహ్ చెల్లెలు. అలాగే దివ్యభారతి స్నేహితురాలు.

ఇక ఈమె ద్వారానే డైరెక్టర్ రాఘవేందర్ రావు గారు దగ్గరకు రావడం కూలి నెంబర్ వన్ సినిమాలో ఛాన్స్ కొట్టేయడం… అనంతరం ప్రేక్షకులని మెప్పించడం జరిగింది. ఇక బాలనాటిగా ఒకే ఒక సినిమాలో కనిపించిన టబు… హీరోయిన్ గా మాత్రం అనేక సినిమాలలో నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు హిందీ, తమిళ్, మలయాళం, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా నటించింది. ఇన్ని భాషల్లో అవలీలగా నటించగల సత్తా ఉన్న ఈమె స్టార్ హీరోయిన్గా కొనసాగింది.

ఇక ప్రస్తుతం 52 ఏళ్లు వయసు కలిగిన టబు… క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటిస్తూ అభిమానులను మెప్పిస్తుంది. ఇక ఈమెకి 52 ఏళ్లు అంటే నమ్మశక్యంగా అనిపించడం లేదు. అంత యవ్వనంగా ఉంది. తన అందంతో కుర్ర హీరోయిన్లకి సైతం గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం ఈమె ఫోటోలను చూసిన ప్రేక్షకులు… ఈమెకి 52 ఏళ్ళ వయసా… అస్సలు నమ్మశక్యం కావడం లేదు. ఈ ఏజ్ లో కూడా ఇంత యవ్వనంగా ఎలా ఉంది. నిజంగా ఈమె ఎక్కడో మత్చేసుకుని పుట్టింటుంది…” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.