ఎన్టీఆర్‌పై క‌న్నేసిన హాట్ హీరోయిన్‌.. మామూలు కోరిక కాదుగా…!

బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో రణబీర్ హీరోగా తెరకెక్కిన యానిమల్ సినిమాతో బోల్డ్ బ్యూటీగా భారీ పాపులార్టిని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన అయినా.. రష్మిక పేరును పక్కనపెట్టి తృప్తి దిమ్రిని తమ క్రష్ గా కుర్రకారు మార్చేశారు.

ఇక ఈ సినిమా లో టూ హాట్ గా కనిపించి కుర్రాళ్లను కవ్వించిన తృప్తి ప్రస్తుతం యానిమల్ సక్సెస్ నేపథ్యంలో పలు ఇంటర్వ్యూలో సందడి చేస్తుంది. కాగా ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. అందులో భాగంగా మీరు సౌత్‌లో ఏ హీరోతో నటించాలని భావిస్తున్నారు అని అడగగా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పింది. ఇప్పటికే సందీప్ రెడ్డి, ప్రభాస్ కాంబినేషన్‌లో వ‌స్తున్న స్పిరిట్ మూవీకి తృప్తి దిమ్రి హీరోయిన్గా సెలెక్ట్ అయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుంది అని చెప్పడంతో ఈ న్యూస్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే స్పిరిట్ లో ప్రభాస్ సారసన న‌టిస్తుందంటూ వార్త‌లు వినిపించాయి. అయితే స్పిరిట్ లో ప్రభాస్ సరసన ఈ హాట్ బ్యూటీ నటిస్తుందన్న అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. కాగా తృప్తి ఎన్టీఆర్ పేరు చెప్పడంతో మా ఎన్టీఆర్ అన్న పై కన్నేసావ జోయా పాప అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.