NBK109: బాలయ్య బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ రిపీట్.. ఈసారి కూడా హిట్ కొట్టేసినట్టే..?!

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సీనియర్ స్టార్ హీరోల్లో బాలకృష్ణకు ఉన్న క్రేజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఏ హీరోకి లేదనడంలో సందేహం లేదు. ఇక 2023వ సంవత్సరం బాలకృష్ణకు కలిసి వచ్చినంతగా మరే ఏ హీరోకి కలిసి రాలేదు. 2023 స్టార్టింగ్లో వీరసింహారెడ్డి తో హీట్ కొట్టిన బాలయ్య మళ్ళీ ఈ ఏడాది చివరిలో భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి 2023 సక్సెస్ అంతా ఆయనదే అనిపించుకున్నారు.

ఇక ప్రస్తుతం బాలకృష్ణ – బాబీ కాంబినేషన్లో తన 109వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు బాలయ్య.అయితే ఈ సినిమాకు బాలకృష్ణతో పాటు మరో సీనియర్ స్టార్ హీరో నటించబోతున్నాడట. ఆయన ఎవరో కాదు సీనియర్ స్టార్ జగపతిబాబు. గతంలో బాలకృష్ణ – జగపతిగా బాబు కాంబోలో లెజెండ్ సినిమా రూపొంది బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు కూడా తన 109వ సినిమాలో బాలయ్య.. జగపతిబాబును విలన్ గా చూస్ చేసుకున్నాడు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో లెజెండ్ సినిమా సెంటిమెంటే మళ్లీ రిపీట్ అవుతుంది. ఈ న్యూస్ నిజ‌మై.. ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే కచ్చితంగా బాలయ్య NBK109 కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటూ.. సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. బాలకృష్ణ ఈ సినిమాతో కూడా ఖచ్చితంగా మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటాడు అంటూ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.