మామా అంటూ వెంకీకి డిఫ‌రెంట్‌గా బ‌ర్త్ డే విషెస్ చెప్పిన తార‌క్‌… నువ్వు కేక బాసు…!

విక్టరీ వెంకటేష్ మనందరికీ సుపరిచితమే. ఈయన నటించిన సినిమాలకు ప్రేక్షకులు ఏ రేంజ్ రెస్పాన్స్ ఇస్తారో మనందరికీ తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు వెంకీ. ఇక తాజాగా వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సైంధవ్ “.

ఈ సినిమా సంక్రాంతి పండగ కానుకగా జనవరి 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది‌. ఇక ఇదిలా ఉండగా… నేడు ఈ స్టార్ హీరో పుట్టినరోజు. వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా తన ఫాన్స్ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే సినీ ప్రముఖులు ఈయనకి బర్తడే విషెస్ తెలుపుతూ ఆశీర్వదిస్తున్నారు.

ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ” మీ విలక్షణ నటనతో మమ్మల్ని అలరిస్తూనే ఉండాలని, ఆరోగ్యం మరియు శ్రేయస్సు తో ఆశీర్వదించబడాలి ” అంటూ బర్తడే విషెస్ తెలిపాడు. ఇక ప్రస్తుతం తారక్ పోస్ట్ సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది.