కళ్యాణ్ రామ్ ” బింబిసారా 2 ” పై అదిరిప‌డే అప్‌డేట్ ఇచ్చేశాడు…!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మనందరికీ సుపరిచితమే. ఈయన నటించిన రీసెంట్ సినిమాలు చూసుకుంటే డిఫరెంట్ అటెంప్ట్ లని తాను చేస్తున్నాడు. ఇక కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న మూవీ ” డెవిల్ “. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కనుంది.

అయితే కళ్యాణ్ రామ్ సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ” బింబిసారా ” అనే చెప్పాలి. ఓ ఇంట్రెస్టింగ్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు ఆడియన్స్ ని.. మెప్పించి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా సీక్వెల్ పై కళ్యాణ్ రామ్ లేటెస్ట్ గా ఓ అప్డేట్ అందించాడు.

ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి స్టార్ట్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్లుగా తెలిపాడు కళ్యాణ్ రామ్. ఇక దీంతో ఈ అవైటెడ్ సీక్వెల్ కోసం నందమూరి అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ ఈనెల (డిసెంబర్) 29న గ్రాండ్గా రిలీజ్ కానుంది.