నాని ” హాయ్ నాన్న ” మూవీపై శివ రాజ్ కుమార్ సెన్సేషనల్ కామెంట్స్…!!

నాచురల్ స్టార్ నాని హీరోగా… శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” హాయ్ నాన్న “. ఇక ఈ సినిమాలో నానికి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతోనే శౌర్యవ్ దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు.

ఇక ఈ సినిమా రిలీజ్ అయి థియేటర్లలో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబడుతుంది. ఇక ఈ సినిమాను చూసిన పలువురు సినీ ప్రముఖులు ఇప్పటికే సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ లిస్టులో కన్నడ సూపర్ స్టార్ అయిన శివ రాజ్ కుమార్ జాయిన్ అయ్యారు.

నాని నటించిన హాయ్ నాన్న సినిమాపై ప్రశంసలు వర్షం కురిపించారు. ” చాలా బాగా ఈ సినిమా చేశారు. ఇందులో నాని నటన మామూలుగా లేదు. ఇంత గొప్ప సినిమాని చేసినందుకు కంగ్రాట్స్ ” అంటూ ట్వీట్ చేశారు. దీనికి నాని కూడా స్పందిస్తూ థాంక్యూ అన్నాడు. ప్రస్తుతం ఈయ‌న‌ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.