జూనియర్ ఎన్టీఆర్ – విజయ్ కాంబోలో మిస్ అయినా క్రేజీ మల్టీస్టారర్.. కార‌ణం ఇదే..?

సౌత్ సినీ ఇండస్ట్రీలో ఊర మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో టాలీవుడ్ నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటి వరుసలో ఉంటాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మూవీ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ ఆస్కార్ రేంజ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక‌ అదేవిధంగా కోలీవుడ్‌లో ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ కూడా తిరుగులేని స్టార్ హీరోగా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద సోషల్ మీడియా వేదికగా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి లక్షల అభిమానులను సొంతం చేసుకోవడం టాలీవుడ్‌లో ఎన్టీఆర్, కోలీవుడ్ లో విజయ్‌కు సొంతం.

ఇక్కడ యంగ్ టైగర్.. అక్కడ ఇళయ దళపతి.. రీల్‌ హీరోలే రియల్‌ హీరోలవుతారా? -  Telugu News | What is the Political Future of Heros Jr NTR Vijay Telugu  News | TV9 Telugu

ఇద్దరు స్టార్ హీరోస్ ఇప్పటివరకు ఎన్నో మ‌ల్టీస్టార‌ర్ మూవీల‌లో నటించారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఇండియాలో మల్టీస్టారర్‌ ట్రెండ్ ఓ రేంజ్‌లో కొన‌సాగుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ – విజయ్ కలిసి ఓ మల్టీస్టారర్‌ల్లో నటిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన ప్రేక్షకులలో మొదలైంది. అయితే ఈ ఆలోచన కేవలం అభిమానుల్లో మాత్రమే కాదు డైరెక్టర్స్ లో కూడా మొద‌తైంది. గ‌తంలో ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ – విజయ్‌తో తుపాకీ, కత్తి, సర్కార్ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను తెర‌కెక్కించాడు.

A.R.Murugadoss reveals Vijay 62 will be an action packed emotional film

ఆయన అప్ప‌ట్లో విజయ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ క్రేజి మల్టీ స్టార‌ర్ తీయాలని ఆలోచన చేశాడ‌ట‌. మల్టీస్టారర్ సినిమాను రెండు భాషల్లో సపరేట్‌గా తీయాలని భావించాడట. తమిళ భాషలో విజయ్ హీరో, ఎన్టీఆర్ విలన్. అలాగే తెలుగు వెర్షన్‌లో ఎన్టీఆర్ హీరోగా.. విజయ్ విలన్ గా రోల్స్‌ని రివర్స్ చేసి తెరకెక్కించాలని ప్లాన్‌లో ఉన్నాడట. గతంలో విక్రమ్‌ రావణ్‌ చిత్రాన్ని ఇలాగే రూపొందించాడు డైరెక్టర్ మణిరత్నం. ఆ సినిమా సక్సెస్ అయింది.

Vijay greets Jr NTR over the phone and fans can't keep calm - India Today

మళ్ళీ అదే ఫార్ములాతో వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో సినిమా రూపొందిస్తే బాగుంటుందని మురుగదాస్ ప్లాన్ చేస్తున్నాడట. కానీ ఎందుకో ఇద్దరు హీరోలు కూడా ఆ క్రేజీ మల్టీ స్టార‌ర్ స్క్రిప్ట్‌ను అంగీకరించలేదు. అప్పట్లో ఆడియన్స్ సినిమాను ఎలా తీసుకుంటారో.. ఫ్యాన్స్ పాజిటివ్గా రియాక్ట్ అవుతారో లేదో.. అని భయం ఉండేది. కానీ ఆర్‌ఆర్ఆర్ తరువాత అలాంటి భయాలు పోయాయి. కాబట్టి భవిష్యత్తులో ఈ క్రేజీ కాంబోలో మల్టీస్టారర్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.