” నా సామి రంగ ” మూవీ టీజర్ లాంచ్ చెయ్యబోతున్న స్టార్ హీరో…. చివరికి అతని పై ఆధారపడుతున్నారా… ఏంటి సార్ ఇది…!

కింగ్ నాగార్జున మనందరికీ సుపరిచితమే. ఈయనకి వయసు మీద పడుతున్న.. ఏమాత్రం అది బయటకు కనిపించకుండా చాలా బాగా మేనేజ్ చేస్తున్నాడు నాగ్. కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఇక నాగార్జున తాజాగా హీరోగా నటిస్తున్న మూవీ ” నా సామి రంగ “. ఈ సినిమాకి విజయ్ బీన్ని దర్శకత్వం వహిస్తున్నాడు.

అలాగే ఈ మూవీలో రాజ్ తరుణ్, అల్లరి నరేష్ కీలక పాత్రలలో పోషించనున్నారు. ఇక నేషనల్ అవార్డు విన్నర్ ఎమ్. ఎమ్ కీరవాణి ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తున్నారు. ఇక తాజాగా కీరవాణి సమకూర్చిన ” ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే పిల్ల ” అనే పల్లవి తో సాగే ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ కూడా దక్కింది.

ఇక అసలు విషయంలోకి వెళితే.. మరొక మూడు రోజుల్లో జరగనున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే కి చీప్ గెస్ట్ గా రానున్న సూపర్ స్టార్ మహేష్ బాబు… అదే షో లో నా సామి రంగ టీజర్ ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.