ఏంటి.. రవితేజ ” ఈగిల్ ” మూవీ రన్ టైం అలా కానుందా?… ఎందుకు?

మాస్ మహారాజ హీరోగా.. యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” ఈగిల్ “. ఈ మూవీని జనవరి 13న ప్రేక్షకుల ముందుకి గ్రాండ్ గా తీసుకురానున్నారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ అందరినీ ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమాపై మంచి హైప్‌ కూడా నెలకొల్పింది.

ఇక ఈ సినిమాలో రవితేజ షూటర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీలో నవదీప్ కీలకపాత్రలో పోషించాడు. ఇక అసలు మేటర్ లోకి వెళితే.. ఈ మూవీ యొక్క రన్ టైం 2 గం. 10 ని.లు ఉండబోతున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్.

ఒకరకంగా ఇది మూవీకి మంచి ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఇక దీనిపై ఈ మూవీ మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి.