పవన్ ” ఉస్తాద్ భగత్ సింగ్ ” పై క్లారిటీ ఇచ్చి పడేసిన హరీష్ శంకర్ ..‌‌ ఇవి కధ గట్స్ అంటే…!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనందరికీ సుపరిచితమే. ఈయన తాజాగా నటిస్తున్న సినిమాలలో ” ఊస్తాద్ భగత్ సింగ్ ” మూవీ ఒకటి. శ్రీ లీల హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై పవన్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ మూవీ ఇప్పటికే కొంతమేర షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. ఇప్పుడు తాత్కాలికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్యాప్ లో బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న ” అన్ స్టాపబుల్ ” షో లో హరీష్ శంకర్ క్లారిటీ ఇవ్వగా… అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈయ‌న‌ మాట్లాడుతూ….” ఈ గ్యాప్ ఒట్టి వెకేషన్ సినిమా రిలీజ్ అయ్యాక సెన్సేషనే ” అంటూ చెప్పుకొచ్చాడు హరీష్ శంకర్. ఇక ఇది చూస్తే… ఈ సినిమా పట్ల అసలు తను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో అనేది అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.