100 టికెట్లతో ‘ సలార్ ‘ మిడ్ నైట్ షో కి రెడీ అంటున్న హీరో..

పాన్‌ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన‌ మూవీ సలార్‌. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు అంతా పాన్ ఇండియా లెవెల్‌లో వేచి చూస్తున్నారు. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెకుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్‌ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. డిసెంబర్ 21 అర్ధరాత్రి 1 గంట నుంచే మిడ్ నైట్ షోలు ప్రారంభమవుతున్నాయట. అయితే గత సినిమాలలో స్టార్ హీరోల మూవీస్ కి మిడ్ నైట్ షోలు వేసేవారు.

కాగా ప్రభుత్వం మిడ్‌ నైట్ షోలకు అనుమతి ఇవ్వకపోవడంతో.. కొంతకాలంగా ఏ మూవీకి మిడ్ నైట్ షో పడలేదు. అయితే తాజాగా సలార్‌ సినిమాకు మిడ్ నైట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దగ్గర దగ్గరగా 10 థియేటర్స్ లో హైదరాబాద్‌లోనే మిడ్ నైట్ షో ప్రారంభించబోతున్నారట. అదే విధంగా తెలంగాణ పలు ప్రాంతాల్లో కూడా ఈ మిడ్ నైట్ షోలకు థియేటర్స్ కేటాయించినట్లు తెలుస్తుంది. ఇక డిసెంబర్ 21 అర్థరాత్రి ఒంటి గంటకి స‌లార్‌ శ్రీరాములు థియేటర్లో ఆట మొదలు పెడుతుంది.

Telugu Actor Nithin Hints at his Impending Wedding - IBTimes India

 

ఈ సినిమాను చూసేందుకు పెద్ద ఎత్తున సెలబ్రిటీస్ ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే యంగ్‌ హీరో నిఖిల్ శ్రీరాములు థియేటర్లో అర్ధరాత్రి ఒంటిగంటకు షో హాజరబోతున్నట్లు వివరించాడు. అంతేకాదు ఆయనతోపాటు 100 మంది ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫ్రీగా టికెట్లు అందజేయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. ఎప్పుడో పదేళ్ల క్రితం మిర్చి సినిమా ధియేటర్‌లో మిడ్ నైట్ షో చూశానని.. మళ్లీ ఇప్పుడు సలార్‌ సినిమాను చూడడానికి ఎంతో ఆసక్తిగా ఉంది అంటూ వివరించాడు. హీరో నిఖిల్ చేసిన ప్రకటన ప్రస్తుతం ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది.