90ల్లో కుర్రాళ్ల‌ని కవ్వించిన ఈ బ్యూటీ గుర్తుందా.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన నటి హీరా. 1990లో తన అందంతో కుర్రాళ్ల మనసు దోచేసింది. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసింది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఆవిడా మా ఆవిడే, లిటిల్ సోల్జర్స్, ఆహ్వానం లాంటి సినిమాలలో నటించింది.

ఇక తమిళంలో హృదయం, నీ బడి నాన్ బడి, తిరుడా తిరుడా , సతిలేలావతి, కాదల్ కోట్టో , అవ్వై షణ్ముఖ లాంటి సినిమాలలో నటించి మంచి ఫేమస్ అయ్యింది. ఇక ఈమె పేరు పోస్టర్ లో కనిపించిందంటే చాలు.. కుర్రాళ్ల‌ని క్యూ కట్టేవారు. ఇక ఈ ముద్దుగుమ్మ 2002 వ సంవత్సరంలో పుష్కర్ మాధవ్ ను పెళ్లాడింది.

ఇక 2006లో పలు వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన అభిమానులు.. ఈమె ఆమెనేనా.. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ‌