ఆ యంగ్ హీరోకి అక్క‌గా న‌టించ‌బోతున్న‌ న‌య‌న్‌.. ఏ మూవీలో అంటే..

కోలీవుడ్ స్టార్స్ సెలబ్రిటీ ప్రదీప్ రంగనాథన్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జయం రవి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించినా కోమలి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా ఇన్స్పిరేషన్‌తోనే తరువాత స్వీయ దర్శకత్వంలో హీరోగా లవ్ టుడే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా భారీ సక్సెస్ అందుకోవడంతో ప్రదీప్ రంగనాథన్‌కు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇందులో కమల్ హాసన్ కూడా ఒక సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాలనుకున్నాడు. కానీ అధిక బడ్జెట్ కావడంతో ఆ సినిమా ఆగిపోయింది.

అదేవిధంగా ప్రదీప్ రంగనాథన్ రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో చాలామంది ప్రొడ్యూసర్లు వెనక్కి తగ్గారని టాక్. ఇలాంటి నేపథ్యంలో లియో సినిమా ప్రొడ్యూసర్ రంగనాథన్ హీరోగా ఓ సినిమాను చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దీనికి నయనతార భర్త విగ్నేష్ శివ‌న్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించాల్సిన అజిత్ సినిమా నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.

కాగా ప్రస్తుతం విఘ్నేష్‌ శివన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఎల్ఐసి అనే టైటిల్ ని పెట్టాలని టీం భావిస్తున్నారట. ఇందులో కథానాయకగా ఓ బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుంది. దీంతో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార.. నటుడు ప్రదీప్ రంగనాథన్ కు అక్కగా నటించబోతున్నట్లు టాక్. ఇక దర్శకుడు మష్కిన్, ఎస్ జె సూర్య, యోగి బాబు తదితరులు కీలకపాత్రలో నటిస్తున్న సినిమాకు.. మ్యూజిక్ సెన్సేష‌న్‌ అనిరుధ్ సంగీతం అందించనునట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంద‌ట‌.