పవన్ టూ రవితేజ.. మ‌న హీరోలు ఇన్ని సినిమాలను హోల్డ్‌లో పెట్టారా.. లిస్ట్ ఇదే…!!

గత వారం రోజులుగా రవితేజ-గోపీచంద్ కాంబినేషన్లో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ హోల్డ్ లో పడినట్లు ప్రచారం జరుగుతుంది. మైత్రి మూవీ మేకర్ సంస్థ ఈ సినిమాని నిర్మించాల్సి ఉంది. రవితేజ, గోపీచంద్ కాంబినేషన్లో డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇక దీంతో వీరి సినిమా అనౌన్స్ చేసిన వెంటనే భారీ హైప్ నెలకొంది. కానీ ఈ సినిమా హోల్డ్ లో పడినట్లు తెలుస్తుంది. ఇలా రవితేజ ఒక్క సినిమానే కాకుండా అనౌన్స్ చేసిన తరువాత హోల్డ్ లో పడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. జె జి ఎం:


టైగర్ తర్వాత విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రెండో సినిమాగా ” జెజిఎం ” అనౌన్స్ చేశారు. ముంబైలో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా.. లైగర్ ఫ్లాప్ తో… ఈ సినిమా హోల్డ్ లో పడింది.

2. కొరటాల-అల్లు అర్జున్:


వీరిద్దరి కాంబినేషన్లో కూడా ఓ మూవీ ఉండనుందని 2021 లో ఎనౌన్స్ చేశారు. కానీ ఎందుకో ఈ ప్రాజెక్టు హోల్డ్ లో పడింది.

3. అల్లు అర్జున్-దిల్ రాజు:


అల్లు అర్జున్, దిల్ రాజు, వేణు శ్రీరామ్ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ఉండనుందని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుపై ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.

4. హరిహర వీరమల్లు:


పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. పాన్ ఇండియా సినిమా కావడంతో కొంచెం ఆలస్యం అవుతుందని నిర్మాత ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

5. వెంకటేష్-తరుణ్ భాస్కర్:


వీరి కాంబోలో కూడా ఓ సినిమా ఉండనుందని గతంలో అధికారిక ప్రకటన చేశారు. కానీ ప్రస్తుతం ఈ సినిమా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇలా సినిమా అనౌన్స్ చేసి.. ఆ సినిమా ఊసే పట్టించుకోకుండా తిరుగుతున్నారు నిర్మాతలు.