Teaser :సత్యభామగా దుమ్ము లేపుతున్న కాజల్.. టీజర్ వైరల్..!!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ వివాహమయ్యి ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టింది.వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న కాజల్ అగర్వాల్ ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఈమె పోషించిన పాత్ర కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తాజాగా లేడీ ఓరియంటెడ్ మూవీ సత్యభామ నుంచి అదిరిపోయే అప్డేట్ రావడం జరిగింది.

ఈ సినిమా కాజల్ కెరీర్ లోని 60వ చిత్రంగా తెరకెక్కిస్తూ ఉన్నారు.దీంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. జూన్లో కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి టైటిల్ గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. అప్పటివరకు కాజల్ అగర్వాల్ ని ఇలాంటి పాత్రలో ఎప్పుడూ చూడలేదు. ఒక్కసారిగా అందర్నీ సడన్ సర్ప్రైజ్ చేయడం జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా సత్యభామ సినిమా టీజర్ ని విడుదల చేశారు చిత్ర బృందం.

ఫస్ట్ గ్లింప్స్ లోనే ఓ రేంజ్ లో యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టేసిన కాజల్.. ఈసారి టీజర్ లో అంతకుమించి అనేలా అదరగొట్టేస్తోంది. కాజల్ అభిమానులకు సైతం ఈ టీజర్ దివాళి బోనాంజగా కనిపిస్తోంది. ఈ చిత్రం టీజర్ విషయానికి వస్తే ఇదొక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ అన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్గా సత్యభామ గా నటించింది. అయితే అనుకోకుండా ఒక కేసులో ఒక వ్యక్తి మరణించడంతో ఆ కేసు నుంచి ఈమెను తొలగిస్తారు.. అయితే తన వల్ల తప్పు జరిగిందని తెలుసుకొని సత్యభామ ఆ కేసుని మళ్లీ ఇన్వెస్టిగేషన్ చేసేలా కనిపిస్తోంది. ఆ తర్వాత ఎదురైన అనుభవాలు ఏంటి ఆ కేసును చేదించిందా లేదా అనే విషయం తెలియాలి అంటే రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందని చెప్పవచ్చు.