గడువు దాటినప్పటికీ టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి ఇప్పటివరకు ఎలాంటి ఊసే లేకుండా పోతోంది .ఎలక్షన్స్ అయిపోయి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతోంది.. ప్రతి రెండేళ్లకు ఒకసారి కచ్చితంగా మా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి.అలా 2021 అక్టోబర్ 10వ తేదీన మా మూవీస్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగడం జరిగింది. ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్షుడుగా గెలిచారు అక్టోబర్ 16న ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది.
అయితే ఈ ఎలక్షన్స్ జరిగి ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావస్తున్న ఈ విషయం పైన టాలీవుడ్ పెద్దలు ఎవరూ కూడా పట్టించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా షూటింగులు ప్రారంభత్సవం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ట్రైలర్ విడుదల ఫంక్షన్ లో సక్సెస్ మీట్ లో ఉంటూ రకాల కార్యక్రమాలలో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా హాజరవుతూ ఉన్నారు మరి వారి మధ్య మా ఎన్నికల అంశం మాత్రం ఇప్పటివరకు చర్చ రేఖ రాలేదు ఒకవేళ వచ్చిన చాలామంది వీటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి
మా అధ్యక్షుడిగా మంచు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు నా హృదయంతో మళ్ళీ మా ఎన్నికల విషయంలో జోక్యం చేసుకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చాలామంది ఈ విషయానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. ఈసారి కూడా మా ఎన్నికలకు మంచు విష్ణు దూరంగానే ఉంటానని తెలియజేశారు. 2021 లో జరిగిన మా ఎన్నికలు సైతం దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలను సైతం తలపించాయి. అటు ప్రకాష్ రాజ్ ఇటు మంచు విష్ణు ఇద్దరు మా అధ్యక్ష పదవికి పోటీ పడగా వీరి మధ్య మాటల యుద్ధంతో పాటు విమర్శలు కూడా వెలుపడ్డాయి. మరి ఈసారి ఎలా జరుగుతాయో చూడాలి.