అనుష్క ఆచూకీ తెలిపిన వారికి రూ.50 వేల రివార్డ్.. మంచి మనసు చాటుకున్న సన్నీ లియోన్..

స్టార్ బ్యూటీ సన్నీలియోన్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనదైన స్టైల్ లో గుర్తింపు తెచ్చుకున్న సన్నిలియోన్ టాలీవుడ్ లో కూడా పలు సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసింది. ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందుకుంటుంది. ఇక ఇటీవల కాలంలో పలు షోలలో కూడా సందడి చేస్తుంది. ఇక సన్నీలియోన్ ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి తన మంచి మనసున్న చాటుకుంది ఈ ముద్దుగుమ్మ. ముంబై కి చెందిన ఓ చిన్ని పాప ఆచూకీ తెలిపిన వారికి తనే స్వయంగా 50 వేల రూపాయలు రివార్డ్ ఇస్తానని తెలియజేసింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది సన్నీ.

ప్రస్తుతం సన్నీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ పాప ఎవరు? సన్నీలియోన్ ఎందుకు ఆ పోస్ట్ పెట్టిందో ఒకసారి చూద్దాం సన్నీలియోన్ తన ఫ్యామిలీతో కలిసి ముంబైలో ఉంటున్న సంగతి తెలిసిందే. తన ఇంట్లో కిరణ్ మోర్ అనే వ్యక్తి పని చేస్తూ ఉంటాడు. అతనికి అనుష్క అనే తొమ్మిదేళ్ల పాప ఉంది. ఆమె ఎనిమిదో తేదీ సాయంత్రం ఏడు గంటల సమయంలో ముంబైలోని జోగేశ్వరి ప్రాంతంలో తప్పిపోయింది. దీంతో బాలిక కోసం తల్లిదండ్రులు వెతుకుతున్నారు. ఇక ఎవరైనా ఆ బాలిక ఆచూకీ తెలిపిన వారికి 11,000 పారితోషం ఇస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా తన ఇంట్లో పనిచేసిన వ్యక్తి కూతురు తప్పిపోయింది అనే విషయం తెలుసుకున్న సన్నిలియోన్ స్వయంగా ఆ పాప కోసం తన మంచి మనసు చాటుకుంది.

ఈ మేరకు బాలిక ఆచుకి తెలిపిన వారికి తానే రూ.50వేల రివార్డు ఇస్తానని పేర్కొంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ పాప ఎక్కడ ఉన్న వారికి దొరకాలి.. ఎలాగైనా ఆ పాపను రక్షించు అంటూ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పని చేసే వ్యక్తి కుటుంబం పైన కూడా ఎంతో శ్రద్ధ చూపుతున్న సన్నీలియోన్ మంచి మనసు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక అనుకోకుండా ఫోర్న్‌ స్టార్ గా మారిన సన్నీ 2011లో బాలీవుడ్ బిగ్ బాస్ లో పాల్గొంది ఇక ఆ తర్వాత ఆమెకు వచ్చిన పాపులారిటీతో సినిమా అవకాశాలు దక్కించుకుంది. అలా తెలుగులో కూడా పలు సినిమాలలో నటించి మెప్పించింది.