ఒప్పుకున్న పెళ్లిళ్లకి.. పెళ్లి భాజాలు మోగించలేకపోతున్న శ్రీ లీల… పాపం డైరెక్టర్లు…!!

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీని షేక్‌ చేస్తున్న హీరోయిన్ శ్రీ లీల. ఈమె టాలీవుడ్ లో పనిచేస్తుందో.. లేదా టాలీవుడ్ డే ఈమె కింద పని చేస్తుందో అస్సలు తెలియడం లేదు. ఎందుకంటే ప్రతి సినిమాలోను ఈ హీరోయిన్ నే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి అస్సలు ఖాళీయే దొరకడం లేదు. స్టార్ హీరోలకు ధీటుగా నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

తాజాగా బాలయ్యతో కలిసి ” భగవంత్ కేసరి ” సినిమాలో నటించి అందరి మనసులు గెలుచుకుంది. అంతేకాకుండా ఒక స్టార్ హీరో సినిమాలోహీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ. స్టోరీ నచ్చకపోవడంతో తప్పుకుందంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి ఆ స్టార్ హీరో ఎవ‌రు.. అనేది తెలియక పోయినప్పటికీ ఈ వార్త మాత్రం తెగ చక్కర్లు కొడుతుంది. అయితే గతంలో కృతి శెట్టి మాదిరిగా ఏవో కథలు ఒప్పుకోకుండా.. మంచి కథ నేపథ్యం ఉన్న సినిమాలు మాత్రమే ఒప్పుకుంటుంది శ్రీ లీల.

అంటే తన క్యారెక్టర్ కు ఇంప్రెస్ లేని పాత్రను అస్సలు దగ్గరికి కూడా రానివ్వడం లేదట. ఇందులో భాగంగానే ఒప్పుకున్న పెళ్లిళ్లకి.. పెళ్లి భాజాలు మోగించలేకపోతోంది శ్రీ లీల. ఇక ఇదే మైండ్ సెట్ తో ఈ బ్యూటీ సినిమాలు ఎంచుకుంటే మాత్రం.. ఇంకొంతకాలం ఇండస్ట్రీలో మెలిగె అవకాశాలు ఉన్నాయంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ పాపం డైరెక్టర్లను అడ్డంగా ముంచేసిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.