తనను ఎవరైనా అలపిలుస్తే దబిడి దిబిడే అంటూ వార్నింగ్ ఇస్తున్న బాలయ్య..!!

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో బాలయ్యకు జోడిగా కాజల్ నటించగా.. బాలయ్య కూతురు పాత్రలో శ్రీ లీల నటించింది.. ఇందులో కాజల్ కంటే శ్రీ లీలా పాత్రకి ఎక్కువగా ప్రశంసలు దక్కుతూ ఉన్నాయి. ఈ సినిమా మూడు వారాలపాటు సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతూ ఉండడంతో ఇటీవల చిత్ర బృందం సక్సెస్ మీట్ సైతం ఏర్పాటు చేసింది.

ఇందులో బాలయ్య మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. బాలకృష్ణ ఏదైనా సరే ఎక్కడైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు.. అప్పుడప్పుడు బాలయ్య మాట్లాడిన మాటలకు సరిత రోల్ కి గురైన సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు తాజాగా తనని ఎవరైనా సరే బాబాయ్ అని పిలిస్తే.. వారికి దబిడి దిబిడే అంటూ తెలియజేశారు. నేను ఈ సినిమాలో హీరోయిన్ శ్రీ లీలా కి బాబాయ్ పాత్రలో మాత్రమే నటించాను మంచి సందేశం కోసమే ఇలా నటించాలని తెలిపారు.

మంచి సందేశాన్ని సమాజానికి అందించడం కోసం ఒక ఆర్టిస్టుగా ఎలాంటి విషయాన్నయినా చెబితే అది కచ్చితంగా ప్రజలలో చాలా బలంగా వెళుతుంది అని నమ్మకంతోనే ఇలా చేసామని తెలిపారు. ఈ సినిమా కూడా ఎవరో చెబితేనే నేను చేయలేదు.. నాకు నేనుగా నచ్చే చేశానని తెలిపారు అంతేకాకుండా నా బాధ్యతగా వ్యవహరించి ఈ చిత్రాన్ని ఒప్పుకున్నానని భగవంత్ కేసరి సినిమా సక్సెస్ లో బాలయ్య మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం బాలయ్య మాట్లాడిన మాటలు సైతం అందరిని ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తున్నాయి