మాజీ ప్రియుని మర్చిపోలేకపోతున్న స్టార్ హీరోయిన్..!!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న దీపికా పదుకొనే తన స్నేహితులను అసలు మర్చిపోలేదట. ముఖ్యంగా తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ ని అసలు మర్చిపోలేదని తెలుస్తోంది. లవ్ బ్రేకప్ అయిన తర్వాత రణబీర్ ఫోటో ని షేర్ చేసి అతడికి ధన్యవాదాలు సైతం తెలియజేసింది. హీరోయిన్గా కెరియర్ ప్రారంభించిన దీపికా పదుకొనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 16 సంవత్సరాలు పూర్తి చేసుకుందట. తనకి ఆరోజు చాలా ప్రత్యేకమైన రోజు అని తెలుస్తోంది.

దీపికా పదుకొనే కెరియర్ లో పనిచేసిన సినిమాల పోస్టర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీపిక ఇన్స్టాగ్రామ్ పేజీలో కొన్ని ఫోటోలను షేర్ చేసి అభిమానులకు కూడా కృతజ్ఞతలు తెలిపింది.దీపిక షేర్ చేసిన ఫోటోలను తన మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ తో ప్రత్యేకంగా ఫోటోలను హైలైట్ అయ్యేలా చేసింది. దీంతో అభిమానుల నుంచి చాలా తీవ్రమైన విమర్శలు ఎదురవుతున్నాయి. రెడ్డీస్ యూజర్ లో దీపికాను ఏకీపారేస్తున్నారు.

రణబీర్ కపూర్ తో ఇంకా దీపికా ప్రేమలో ఉందని అందుకే అతడి ఫోటోను ఇంత ప్రేమగా షేర్ చేసిందని పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీపిక తన భర్త బాలీవుడ్ స్టార్ హీరో అయిన రణవీర్ సింగ్ తో ఉన్న ఫోటోని ఎందుకు షేర్ చేయలేదని చాలా మంది ఈమెను తిట్టిపోస్తున్నారు.. కాఫీ విత్ కరణ్ షోలో 8వ ఎపిసోడ్ ఫ్లాప్ అయ్యాక దీపికా పైన కూడా ట్రోల్స్ రావడం జరిగింది. దీపికా పదుకొనే గత జీవితం పైన చేసిన స్కిట్ వీడియో వైరల్ కావడంతో మరొకసారి ట్రోల్ కి గురైంది. ఇప్పుడు కూడా తన భర్త ఫోటో కాకుండా మాజీ ప్రియుడు ఫోటోలు షేర్ చేయడంతో చాలామంది విరుచుకుపడుతున్నారు.