స్టార్ హీరోల అందరికీ కూడా ఈ వీలనే కావాలట..!!

సాధారణంగా ఇండస్ట్రీలోకి చాలామంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. ఒకానొక సమయంలో కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సునీల్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవారు.. మొదట విలన్ గా అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సునీల్ అనుకోకుండా కమెడియన్ గా మారి స్టార్ స్టేటస్ ని అందుకున్నారు.. అలా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని మంచి పాపులారిటీ సంపాదించుకున్న సునీల్ ఆ తర్వాత రెండు మూడేళ్లు హీరోగా పలు సినిమాలలో నటించిన ఫెయిల్యూర్ గా మిగిలారు.

ఇక ఆ తర్వాత పలు సినిమాలలో విలన్ గా నటించి మరొకసారి తన సత్తా చాటారు. పుష్ప సినిమాలో సునీల్ వీలన్ జానికి సైతం అభిమానులు ఫిదా అయిపోయారు. ఒకప్పుడు ప్రేక్షకులు ఏ మొహాన్ని చూసి నవ్వారో ..ఇప్పుడు అదే ఫేస్ ను చూసి చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతలా తన క్యారెక్టర్లలో జీవిస్తూ ఉన్నారు సునీల్. ముఖ్యంగా తమిళ స్టార్ హీరోలకు మాత్రం సునీల్ విలన్ గా నటించాలని పట్టుబడి మరి అతన్నే తీసుకుంటున్నారట.

రజనీకాంత్ జైలర్ సినిమాలో కామెడీ విలన్ గా నటించిన బాగానే ఆకట్టుకున్నారు. తాజాగా మరో హీరోకు సునీల్ విలన్ గా నటించబోతున్నారు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న హరోం హర సినిమాలో విలన్ గా నటించబోతున్నారు. జ్ఞాన సాగర్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. సునీల్ విలన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ని సైతం విడుదల చేయడం జరిగింది. ఈ సినిమా కూడా ఒక పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. రోజు రోజుకి సునీల్ రేంజ్ మాత్రం పెరిగిపోతోంది.