కరణ్ జోహార్ షో పై నాని షాకింగ్ కామెంట్స్..!!

స్వయంకృషి కూడా తో పైకి వచ్చిన వారిలో నేచురల్ స్టార్ నాని కూడా ఒకరు. ఇటీవల కాలంలో పాన్ ఇండియా హీరోగా మంచి మంచి కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఉన్నారు. ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న నాని ఇప్పుడు తాజాగా హాయ్ నాన్న అనే ఒక ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో పలు రకాల ప్రమోషన్స్లో పాల్గొన్నా నాని పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.

తాజాగా ఒక నేషనల్ మీడియా నిర్వహించిన టేబుల్ సమావేశంలో నాని హాజరు కావడం జరిగింది.ఇందులో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తున్న టాక్ షో పైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. కాఫీ విత్ కరణ్ షో కి పిలిస్తే వెళ్తారా అని ఒక యాంకర్ అడగగా అందుకు నాని సమాధానంగా అషోకి పిలిచిన తాను రానని గౌరవంగా చెప్పేస్తానని తెలిపారు. కరణ్ జోహార్ ని కలిసి సినిమాలు గురించి మాట్లాడమంటే ఓకే కానీ ఆ షోలోకి మాత్రం వెళ్ళమంటే వెళ్ళను అని తెలిపారు.

తనలాంటి వాళ్లకి ఆ షో సెట్ అవ్వదని తెలిపారు నాని.. బాలీవుడ్లో హిట్ టాక్ షోగా పేరు తెచ్చుకున్న కాఫీ విత్ కరణ్ షో పైన చాలామంది కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇందులో ఎక్కువగా బోల్డ్ కంటెంట్ పర్సనల్ విషయాలను మాత్రమే ఇంటర్వ్యూ అడుగుతూ ఉంటారు కరణ్.. దీంతో కరణ్ షో పై కూడా బయట కొంతమంది వ్యతిరేకత ఉందని చెప్పవచ్చు. ఇలాంటి వాటి వల్లే నాని ఇలాంటి షోలకు వెళ్లాలని చెబుతున్నాడని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.