బ్లాక్ ట్రెండీ వేర్‌లో టెంప్టింగ్ ఫోజులిస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ఆ టాటూ మీనింగ్ ఏంటంటే..?!

పైన ఫోటోలో ఉన్న ఈ అమ్మాయి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది. హాలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. ఓ సౌత్ స్టార్ హీరో వారసురాలుగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన నటనతో విమర్శకులతో ప్రశంసలు అందుకుంది. అందం, అభినాయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్ గానే కాకుండా సింగర్, డాన్సర్ గాను కూడా తన టాలెంట్ను చూపించి మల్టీ టాలెంట్ బ్యూటీగా మారింది.

మొదటి బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకో లేకపోయినా ఈమె నటనకు మాత్రం మంచి మార్కులు వచ్చాయి. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాదిలోనే బ్లాక్ బ‌స్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికైనా ఎవరో గుర్తుపట్టారా? తనే కమలహాసన్ కూతురు శృతిహాసన్. నిత్యం నెట్టింట లేటెస్ట్ హాట్ ఫోటో షూట్లతో రచ్చ చేస్తూ.. చూపరులను ఆకట్టుకుంటుంది.

Shruti Haasan Stunning poses in Black dress NSK

కుర్రాళ్లను కవ్వించే విధంగా గ్లామర్ షో తో రెచ్చగొడుతుంది. ఇక తాజాగా బ్లాక్ ట్రెండి డ్రెస్ లో క్రేజీ స్టిల్స్ తో అదరగొట్టింది. శృతి హాస‌న్ ప్రస్తుతం షేర్ చేసిన ఈ పిక్స్ సోషల్ మీడియాలో కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ పిక్స్ లో తన భుజంపై కనిపిస్తున్న టాటూ కి అర్థం శృతి. ఆమె పేరుని తమిళ్ లో టాటూ గా వేయించుకుంది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ప్రస్తుతం శృతిహాసన్ పాన్ ఇండియా మూవీ స‌లార్‌లో నటిస్తున్న సంగతి తెలిసింది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.