నేను ఇప్పటివరకు పోగొట్టుకున్న జ్యూలరీ తో ఓ ఇల్లు కట్టొచ్చు.. మెగా డాటర్ కామెంట్స్ వైరల్‌..

మెగా డాటర్ నిహారికకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో యాంకర్ గా హీరోయిన్ గా ప్రొడ్యూసర్ గా రాణించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లకు సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉంది. మొదట బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరించిన ఈ బ్యూటీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తర్వాత హీరోయిన్ అవకాశాన్ని దక్కించుకొని పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు సక్సెస్ కాలేదు. దీంతో కుటుంబ సభ్యుల సమక్షంలో జొన్నలగడ్డ వెంకట చైతన్యను అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది. ఈ పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. ఇటీవల వీరిద్దరూ విడాకులు తీసుకుని ఎవరి కెరీర్‌లో వారు బిజీగా ఉన్నారు.

ఇక చైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నిహారిక సినీ కెరీర్ పై ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ పలు వెబ్ సిరీస్లలో నటించడమే కాకుండా నిర్మాత గా కూడా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఇలా వెబ్ సిరీస్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ అందుకున్న నిహారిక ప్రస్తుతం ఓ సినిమాకు నిర్మాతగా మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాల్లోనూ చురుగ్గా పాల్గొంటుంది ఈ బ్యూటీ. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక పలు ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను షేర్ చేసుకుంది. ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారికకు మీరు ఫస్ట్ టైం ఎప్పుడు మేకప్ వేసుకున్నారు అంటూ ప్రశ్న ఎదురుగా నేను ఢీ షో కోసమే నా మొదటి మేకప్ ను వేసుకున్నాను అంటూ వివరించింది.

ఈ షో నాకు ఎప్పటికీ చాలా మెమొరబుల్ అంటూ చెప్పుకొచ్చిన ఈమె చిన్నప్పుడు ఎప్పుడైనా విలువైన వస్తువులను పోగొట్టుకుని బాధపడ్డారా అని అడగగా పోగొట్టుకోవడం.. ఆ విషయంలో మనమే ఫస్ట్ అంటూ సమాధానం చెప్పింది. చిన్నప్పుడు అమ్మ తన కోసం ఎన్నో రకాల డిజైనర్ జ్యూలరిని తెచ్చి పెట్టేదని.. నేను వాటిని చాలా ఎక్కువగా పోగొట్టానని నిహారిక వివరించింది. ఇప్పటివరకు నేను పోగొట్టుకున్న బంగారంతో ఓ ఇల్లు ఈజీగా కట్టేయొచ్చు అంటూ నిహారిక వివరించింది. నేను పెట్టుకున్న నగలు ఉన్నాయో లేదో కూడా గమనించుకునే దాన్ని కాదు అంటూ నిహారిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ‌డంతో అందరూ మరి అంత‌ గోల్డ్ జ్యువెలరీని పోగొట్టుకుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.