కొబ్బరి పీచుతో ఇన్ని ప్రయోజనాల.. అవేంటో తెలిస్తే ఎప్పుడు పడేయరు.. !!

కొబ్బరి ఉపయోగాలు, ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలుసు. ఇక సౌత్ సైడ్ లో కూర‌లలో, స్వీట్స్ , స్నాక్స్‌లో కూడా కొబ్బరిని బాగా వాడుతూ ఉంటారు. కొబ్బరి శ‌రీర‌ ఆరోగ్యానికి కాక.. చర్మ ఆరోగ్యానికి కూడా జుట్టు హెల్దిగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. అయితే కొబ్బరి పీచుతో కూడా ప్రయోజనాలు ఉంటాయని చాలామందికి తెలియదు. ఇది పనికి రాదు అని పరిగణిస్తారు. చాలామంది పడేస్తుంటారు. మరి కొంతమంది పొయ్య మంట వేయ‌టానికి వాడ‌తారు. అయితే దీనివల్ల ప్రయోజనాలు ఏంటి ఎలా ఉపయోగించాలో ఒకసారి చూద్దాం.

మనం ఎక్కువగా కొబ్బరి నూనె గాయాలు పై వాడుతూ ఉండటం. అలాగే గాయం తర్వాత వాపు ఉన్న ప్రదేశంలో కూడా కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది. కొబ్బరి పీచుని పసుపుతో కలిపి మంట ఉన్నచోట రాస్తే మంట తగ్గుతోంది. కొబ్బరి పీచు పసుపు దంతాలను తెల్లగా మార్చడంలో సాయపడుతుంది. కొబ్బరిపొట్టును కాల్చి మెత్తగా పొడి చేసుకోని ఆ మిశ్ర‌మంలో సోడాను మిక్స్ చేసి పళ్ళ పై సున్నితంగా రాసిన పళ్ళు చాలా తెల్లగా కనిపిస్తాయి. కొబ్బరి పీచుతో తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. బాణీలో కొబ్బరి పీచును వేడి చేసి మెత్తగా రుబ్బుకుని ఆ పొడిని కొబ్బరి నూనెలో కలిపి పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దాన్ని హెయిర్ ప్యాక్ గా వాడవచ్చు.

కొబ్బరి పీచుపొడిని నూనెలో కలిపి తలకు పట్టించి గంటసేపు అలాగే ఉంచాలి. ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీ జుట్టు నల్లబడుతుంది. అదేవిధంగా వేడి వేడి నీళ్లలో కొద్దిగా తేనె వేసి.. కలిపిన తరువాత కొబ్బరి పీచుతో ఆ నీటిని ముంచి మోచేతులకు, కాళ్లకు, అరికాళ్ళకు రాసుకుంటే సున్నితంగా మారుతాయి. పగిళ్ళుపోతాయి. అలాగే చర్మం కూడా నిగరింపుగా ఉంటుంది. వేగంగా రుద్దవద్దు సున్నితంగా రబ్ చేయండి. కొబ్బరిపీచు ఆడవారి నెలసరి నొప్పి నుంచి కూడా ఉపశమనాన్ని కల్పిస్తుంది. కొబ్బరి పీచులు కాల్చి మెత్తగా రుబ్బుకున్న నీళ్లతో కలిపి తాగితే నొప్పి నుంచి ఉపశమనం దొరుకుతుంది.