ముదురుతున్న త్రిష- మన్సూర్ అలీ ఖాన్ వివాదం.. ఈసారి ఏకంగా..?

మన్సూర్ అలీ ఖాన్ , త్రిష పేరు చాలా వైరల్ గా మారుతోంది .విలన్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. రీసెంట్గా లియో సినిమాలో కూడా నటించడం జరిగింది.మన్సూర్ అలీ ఖాన్ ఇప్పటికీ ఎన్నో వివాదాలు చిక్కుకోవడం జరిగింది. చాలాసార్లు కాంట్రవర్సీ కామెంట్లను చేసి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా హీరోయిన్ త్రిష పైన పలు సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలను నిలిచారు..మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతు హీరోయిన్ త్రిష పైన అసభ్యకరమైన కామెంట్లు చేయడం జరిగింది.

దీంతో సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు సైతం అందరూ త్రిషకి సపోర్టుగా చేశారు. డైరెక్టర్ లోకేష్ కనకరాజు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇలా చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా మన్సూర్ అలీ ఖాన్ పైన ఫైర్ కావడం జరిగింది. అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. తాజాగా మరొకసారి త్రిష ఫై చేసిన కామెంట్స్ పైన మన్సూర్ అలీ ఖాన్ ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేయడం జరిగింది.

మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ త్రిష పై తాను చేసిన కామెంట్స్ ని ఎవరో ఎడిట్ చేశారని తెలిపారు. అలాగే త్రిషపై ఆయన చేసిన కామెంట్స్ విషయంలో అసలు క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని తెలిపారు.. తనని ఆ మాటలు అనలేదని తన మాటలను ఎడిట్ చేసి వీడియో షేర్ చేశారని తనని కావాలని బ్యాడ్ చేస్తున్నట్లు ఒక నోట్ రాయడం జరిగింది. తనకి తమిళ ప్రేక్షకుల మద్దతు ఉందని తెలియజేయడం జరిగింది. తమిళ సినీ ఇండస్ట్రీ నుంచి రెడ్ కార్డు విధించిన వారికి గడువు ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలియకుండా ఇలా చేసినందుకు తానే సమయాన్ని ఇస్తున్నట్లు తెలియజేశారు.